దుర్గమ్మకు ముక్కుపుడకను సమర్పించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ 


విజయవాడ : తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడవాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆయన కుటుంబసమేతంగా ఈ ఉదయం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అమ్మవారికి ముక్కపుడకను సమర్పించారు. అనంతరం ఈవో సురేష్ బాబు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు.