రవాణా శాఖలో పబ్లిక్ పోలీసింగ్..

రవాణా శాఖలో పబ్లిక్ పోలీసింగ్..
* రవాణా శాఖ మంత్రి పేర్నినాని 
విజయవాడ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపేవారిని పబ్లిక్ పోలీసింగ్ ద్వారా అడ్డుకట్ట వేయడానికి వాట్స్ యాప్ ను ఏర్పాటు చేశామని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. విజయవాడలోని స్థానిక రవాణా శాఖ కమీషనర్ కార్యాలయంలో మంత్రి పేర్ని నాని బుధవారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి కోసం వాట్స్ యాప్ నెంబర్ 9542800800 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేవలం పోలీస్, రవాణా శాఖ అధికారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి నడిపిన వాహనం నెంబర్ కనబడే విధంగా ఫోటో తీసి 9542800800 నెంబర్ కు వాట్స్ యాప్ చేయాలన్నారు. ఆ ఫోటో ఆధారంగా ట్రాన్స్ పోర్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించే వారికి ఫైన్ వేసి చలానా ఆన్ లైన్ లో పంపించడం జరుగుతుందన్నారు. యాక్సిడెంట్ మరణాలను తగ్గించడానికి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగించడానికి దీనిని అమలు చేస్తున్నామన్నారు. ఇది రవాణా శాఖకు ఆదాయం కోసం కాదని, దీని వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువని రవాణా శాఖకు ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్ మీద ఎక్కువగా ఆదాయం వస్తుందన్నారు. ముఖ్య కూడళ్లలో పోలీస్, సి.సి కెమెరాలు ఉంటాయని, మిగిలిన చోట్ల రోడ్లపై ఎక్కువగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించడానికి ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ట్రాఫిక్ ఉ ల్లంఘన జరిగినా వెంటనే ఈ వాట్స్ యాప్ నెంబర్ కు పంపించాలన్నారు. పంపిన వారి ఫోన్ నెంబర్లు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడం ద్వారా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలకు పాల్పడే వారికి దీనిద్వారా అడ్డుకట్ట వేయడం సులభమవుతుందన్నారు. జాయింట్ కమీషనర్ ప్రసాదరావు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వాహనం నడపడం, రాంగ్ పార్కింగ్ చేయడం, ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్ళడం, సిగ్నల్ జంపింగ్, నెంబర్ ప్లేట్స్ నిబంధనల ప్రకారం లేకపోవడం, ప్రమాదకరంగా ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేయడం, ఓవర్ ప్రొజెక్షన్స్, ఆటోలలో ఎక్కువ మంది ప్రయాణీకులను, స్కూల్ పిల్లలను ఎక్కించడం, స్కూల్ బస్లలో ఎక్కువ మంది పిల్లలను ఎక్కించడం, గూడ్స్ వాహనాలు టార్పాలిన్ తో కప్పకుండా రోడ్లపై ప్రయాణించడం తదితర ఉల్లంఘనలపై వాట్స్ ఆప్ చెయ్యాలని సమావేశంలో వివరించారు. కార్యక్రమంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, రవాణాశాఖ కమీషనర్ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ఆర్టీసీ ఎండీ ఎన్.వి.సురేంద్రబాబు, సమాచార శాఖ కమీషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ అదనపు కమీషనర్ పి.శ్రీనివాస్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్లు, డిటిసిలు, ఆర్టీవోలు పాల్గొన్నారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..