సెప్టెంబర్‌ 4న ఏపీ కేబినెట్‌ భేటీ


అమరావతి : ఏపీ మంత్రివర్గం సెప్టెంబర్‌ 4న సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో ఉదయం 11 గంటలకు కేబినెట్‌ భేటీ కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభం, అమలుపై కేబినెట్‌ సమీక్షించి ఆమోదించనుంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండర్ల ఆమోదం, రాజధానిలో చేపట్టే అభివృద్ధి పనులపైనా చర్చించే అవకాశముంది. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.