ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


అమరావతి : కొత్త ఇసుక విధానంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక రవాణా టెండర్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత అర్థరాత్రి గనులశాఖ ఆదేశాలు జారీ చేసింది. కిలోమీటర్ ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లు రద్దు చేసింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని టెండర్లను రద్దు చేసింది. జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులు దరఖాస్తు చేసుకుంటే వారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. కిలోమీటర్కి. రూ.4.90 ఖరారు చేసినట్లు తెలుస్తోంది.