వెంకయ్యనాయుడు పర్యటన

భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు జిల్లాలో 27 మరియు 28వ తేదీలలో పాల్గొను కార్యక్రమాలు:                  ఈ నెల 27వ తేదీన మంగళవారం ఉదయం 7.45 గం. లకు ఆత్కూరు, స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి బయలుదేరి 8.30కు విజయవాడ హోటల్ గేట్వే కు చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి గా రెండు సం వత్స రాలు పూర్తి అయిన సందర్భంగా స్నేహితులు, సన్నిహితులతో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 10.15 బయలుదేరి ఉదయం 11.00 లకు ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ట్రస్ట్ లు వివిధ స్కిల్ డెవలప్మెంట్లో  శిక్షణ పొందుతున్న వారితో ముఖముఖి మాట్లాడుతారు,అనంతరం ఉత్పత్తుల ప్రదర్శన ను తిలకిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ నెల 28వ తేదీ బుధవారం ఉదయం 8.40లకు స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు,9.00 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం వెళతారు.