తిరుపతి పరిసరాల ప్రాంతంల్లో భూముల గుర్తించాలి ఆర్.డి.ఓ నరసా రెడ్డి

తిరుపతి నగర పరిసరాలలో అన్యాక్రాంత భూములను త్వరగా గుర్తించాలి - కనక నరసారెడ్డి


తిరుపతి, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగర పరిసరాలలో అన్యాక్రాంతంకు గురైన హతిరామ్ మఠం  భూములను గుర్తించి పూర్తి నివేదిక తయారుచేయాలని తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి కనక నరసారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం స్ధానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో తిరుపతి పట్టణ, గ్రామీణ  తహసిల్దార్ లు, దేవదాయ శాఖ అధికారులు, హతిరామ్ మఠం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డిఓ వివరిస్తూ ప్రభుత్వము నుండి అన్యాక్రాంత భూముల వివరాలు తక్షణమే సేకరించాలని ఆదేశాలు అందిన నేపథ్యంలో తిరుపతి నగరం చుట్టుపక్కల హతిరాంజీ మఠం, దేవదాయ శాఖల  భూముల అన్యాక్రాంత వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి నివేదిక రూపొందించాలని అన్నారు. ప్రస్తుత ప్రాథమిక అంచనా మేరకు 529. 92 ఎకరాలుగా గుర్తించామని అయినా పూర్తి స్థాయి నివేదిక త్వరలో  రూపొందించాలని తెలిపారు. నివేదిక అందిన మేరకు జిల్లా కలెక్టర్ వారు  పోలీస్ అధికారులతో , మఠం వారితో సమావేశం కానున్నారని అప్పుడు ఈ భూముల విషయమై ఒక కార్యాచరణకు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image