ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు కొఱకు మంత్రుల కమిటీ

*.   ఆంధ్రప్రదేశ్ లో  ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు లాయర్లతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వ కమిటీ....*     ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. రాష్ట్రఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. కమిటీలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స, ఆర్థిక మంత్రి బుగ్గన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ సభ్యులు ఉంటారు. ఈ కమిటీ పరిశీలించే అంశాలను కూడా జీవోలో పేర్కొన్నారు. వీరితో పాటు చర్చి మతాధికారులు (ప్రీస్టులు) ఫాదర్లు, ఇమామ్‌లు, పాస్టర్స్‌, ఇల్లు లేదని పేదలతో పాటు ఇతర వర్గాలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు సంబంధించి ఇపుడున్న నియమ నిబంధనలు, విధానాలు పరిశీలించి... కొత్త విధానాన్ని ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.
జర్నలిస్టులకు సంబంధించి ఇంటి స్థలాలు కేటాయించడానికి అక్రిడేషన్‌/ కేడర్‌/ ఇపుడున్న నిబంధనలు/ ఎలక్ట్రానిక్‌మీడియా ఆధారంగా లబ్దిదారుల అర్హతలు నిర్ణయించడం, ఇంటి పట్టాలకు సరైన స్థలాలను ఎంపిక చేయడం, వ్యక్తిగతంగానా లేదా సముదాయంగా ఇంటి స్థలాలు కేటాయించాలా అనే అంశాన్నికమిటీ పరిశీలిస్తుంది. అలాగే అలాట్‌మెంట్‌కు సంబంధించిన నియమ నిబంధనలతో పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ