మూడు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ను పూర్తి చేయండి


తాగునీటిపై సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం
అమరావతి : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించేలా సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం పనులను మూడు దశల్లో సత్వరమే పూర్తి చేయాలన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్‌ అధికారులు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని మొదటి దశలో భాగంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీటి వసతి కల్పించాలని సీఎం ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును ఆ జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సూచించారు. రెండోదశలో విజయనగరం, విశాఖతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో శుభ్రమైన తాగునీరు అందించాలని.. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తాగునీరు ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు. నీటిని తీసుకున్న చోటే శుద్ధిచేసి అక్కడ నుంచి పంపిణీ చేయాలని సమావేశంలో ప్రాథమిక నిర్ణయించారు. దీనిపై నిశిత అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వాటిలో తాగునీరు నింపిన తర్వాత కలుషితం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఆలోచన చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ట్రీట్‌ మెంట్‌ప్లాంట్‌ నుంచి నేరుగా ఇళ్లకే తాగునీటిని పంపిణీచేయాలని సీఎం ఆదేశించారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image