రాష్ట్ర వైద్య మండలి చైర్మన్‌గా సాంబశివరెడ్డి


అమరావతి : రాష్ట్ర వైద్య మండలి చైర్మన్‌గా డాక్టర్‌ బూచిపూడి సాంబశివరెడి,్డ వైస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ దేవరపల్లి రాజ్యలక్ష్మిని సభ్యులు ఎన్నుకున్నారు. వైద్యులు డి.రాజ్యలక్ష్మి, డి.సోమశేఖర్‌, బి.సాంబశివారెడ్డి, డి.వరప్రసాద్‌, ఎస్‌. విజయ్‌కుమార్‌రెడ్డితోపాటు వైద్యవిధాన పరిషత్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌, కమిషనర్‌ వైద్య విధాన పరిషత్‌, ఎన్టీఆర్‌ యూహెచ్‌ఎ్‌స వైస్‌ చాన్సలర్‌ను ప్రభుత్వం రాష్ట్ర వైద్య మండలిలో సభ్యులుగా నియమించింది.