అర్చకునిపై దాడి అమానుషం

       *గుంటూరు జిల్లా కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి వారి దేవాలయంలో పూజాదికాలను చేస్తున్న అర్చక స్వామిపై మాజీ పాలకవర్గ సభ్యుడు తనకు మర్యాదను ఇవ్వలేదనే నెపంతో అమర్యాదకరంగా దూషించడమే కాకుండా, భౌతికంగా దాడి చేసి గాయాలకు గురిచేయడం అమానుషం,అనాగరికమైన చర్యలనీ ఓజిలి మండలం శ్రీపట్టాభిరామ బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షులు కోనా.వేంకటచంద్రమౌళి అన్నారు. చిల్లమానుచేనులో నిర్వహించిన సమావేశంలో ఆయన ఇంకా మాట్లాడుతూ ఇటువంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నామని, విధినిర్వహణలో ఉన్న అర్చకస్వామిపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలు ఏకమై ఉద్యమించవలసివస్తుందన్నారు. ఇంత జరిగినా అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. సమావేశంలో పట్నం.ప్రసాద్, మధు, ఫణి, పి.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.*