*అధికారికంగా ప్రభుత్వం అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవము ను నిర్వహించాలి*

*అధికారికంగా ప్రభుత్వం అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవము ను నిర్వహించాలి*ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవము ను అక్టోబరు1న నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేసారు. బుధవారం కర్నూలు లో జిల్లా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి కి వినతిపత్రం పంపారు.అదేవిధంగా BJP రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కు, రాజ్యసభ సభ్యులు T.G.వెంకటేష్ కు, TDP జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వేంకటేశ్వర్లుకు, కాంగ్రెస్ , CPM, CPI,తదితర పార్టీల ప్రతినిధులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.....
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రము నుండి విడిపోయి తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1, 1953 న సాధించుకున్న విషయం విదితమే. భారత దేశంలో ప్రప్రధమంగా బాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇది  నాంది.  తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం  కర్నూలు రాజధానిగా 3 సంవత్సరాలు  కొనసాగింది‌. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంతో జతకలవడంతో 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం,  తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి 2014లో విడిపోవడంతో 1953 లో సాదించికున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నది.  


ఈ నేపధ్యం లో అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న జరుపుకోవాల్సిన ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీ పొట్టి శ్రీరాముల ఆత్మ త్యాగ పలితం తో ఏర్పడిన మొట్ట మొదిటి బాషా ప్రయుక్త తెలుగు రాష్ట్రం అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న ప్రభుత్వం నిర్వహించేలాగా  కృషి  చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.


ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు యేర్వ రామచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, M.V.రమణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.