అరుణ్ జైట్లీ మృతి పట్ల చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి

అంతిమతీర్పు. 24.8.2019


అరుణ్ జైట్లీ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
కేంద్ర మాజీమంత్రి, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. 
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరం. 
కేంద్రమంత్రిగా,రాజ్యసభ సభ్యునిగా,ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసిన సేవలు చిరస్మరణీయం. వాజ్ పేయి, నరేంద్రమోడి మంత్రివర్గాలలో న్యాయ సంస్కరణలు, ఆర్ధిక సంస్కరణల కోసం కృషి చేశారు. 
విద్యార్ధి సంఘం అధ్యక్షునిగా ప్రారంభమైన జైట్లీ రాజకీయ జీవితం ఎంపిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రముఖ న్యాయకోవిదునిగానే కాకుండా గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరొందారు. 
ఆయన మృతి బిజెపికే కాకుండా మొత్తం దేశానికే  తీరనిలోటు. అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి.  భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధిస్తున్నాను.
నారా చంద్రబాబు నాయుడు
(తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు)