అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన తర్వాత రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈనెల 30న అమరావతిలో పర్యటించనున్నారు. రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులు ఆయన పరిశీలించననున్నారు. అనంతరం రాజధాని రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. మంగళగిరి పాత బస్టాండ్ దగ్గర నుంచి నవులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు మీదుగా పవన్ పర్యటన సాగుతుంది. కాగా ఇటీవల రాజధాని రైతులు పవన్ను కలిసిన విషయం తెలిసిందే.
ఈనెల 30న అమరావతిలో పర్యటించనున్న పవన్