నెల్లూరు : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ నెల్లూరు వెళ్లారు. అయితే ఆయన వెళ్లింది సినిమా షూటింగ్ కోసం కాదు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే రామ్రాజ్ కాటన్ షోరూంను ప్రారంభించడానికి. రామ్రాజ్ కాటన్ షోరూం 100వ బ్రాంచ్ని నెల్లూరు ట్రంకు రోడ్డులో ప్రారంభించారు. ఈ షోరూంను సోమవారం ప్రారంభమైంది. అభిమాన హీరో వెంకటేశ్‌ని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. 21 సంవత్సరాల తర్వాత నెల్లూరుకి వచ్చాను. నగరం చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు ఆప్యాయత, అనురాగాలు వెలకట్టలేనివని అన్నారు వెంకటేశ్.
నెల్లూరులో రామ్రాజ్ షోరూంని ప్రారంభించిన విక్టరీ వెంకటేశ్