అన్యమత ప్రచారం పై ఆర్టిసి ఉద్యోగి పై వేటు.

అన్యమత ప్రచారం పై ఆర్టిసి ఉద్యోగి పై వేటు.
సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లో పరిధిలో ఇటీవల ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారం పై జరిగిన నేపథ్యంలో స్పందిం చిన రాష్ట్ర ప్రభుత్వం దానికి బాధ్యులైన ఆర్టీసీ ఉద్యోగి పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్టీసీ టికెట్ల వెనుక తక్కువ ధరకే జెరూసలేం యాత్ర పేరుతో ప్రింట్ చేసిన వ్యవహారంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. దానికి బాధ్యులైన నెల్లూరు జోన్ స్టోర్ కంట్రోలర్ జగదీశ్వర్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అన్యమత ప్రచారం పై తిరుమల భక్తులు నుంచి వెల్లువెత్తిన నిరసన పై  సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్టీసీ టికెట్ల వెనకాల అన్యమత ప్రచారం  వెనకాల ఎవరున్నారు అన్న దానిపై ఆర్టిసి ఎండి సమగ్ర నివేదిక అందించాలని ఆర్టీసీ అధికారులను కోరారు.