సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల

అంతిమతీర్పు. 24.8.2019


టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేఖరుల సమావేశం:


** పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి
** జగన్ ప్రభుత్వం పంతానికి పోయి పోలవరం ప్రాజెక్టును దిక్కులేని ప్రాజెక్టులా మార్చొద్దు 
** రాజధాని, పోలవరం విషయంలో జగన్ తన వైఖరి మార్చుకోవాలి 
** రాజధానిలో వరద లేదు.. వంకాయ లేదు.. వరద పేరుతో జగన్ ప్రభుత్వం రాజకీయం 
** జగన్ రావాలి.. జగన్ కావాలి అంటే ఇప్పుడు అన్నీ కూల్చాలి.. అందరినీ తిట్టాలనేలా పాలన ఉంది 


 విజయవాడ, ఆటోనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ  నేడు రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. సీఎంగా జగన్ వింత ధోరణితో ముందుకు సాగుతున్నారు. జరిగే అభివృద్ధి మొత్తం తన కనుసన్నల్లో ఉండాలని మొండిగా వ్యవహరిస్తున్నారు. మేము కనుసైగ చేస్తే ప్రజల జీవితం సాగాలి, లేకుంటే ఆగిపోవాలి అనే విధంగా జగన్ పాలన ఉందని విమర్శించారు. గతంలో వైఎస్, కిరణ్ కుమార్‌రెడ్డి అమలు చేసిన పథకాలను మరింతగా చంద్రబాబు ముందుకుతీసుకెళ్లారు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టారనే కారణంగా నిలిపివేశారు. చంద్రబాబు పాలనలో అనేక అంశాలలో గ్రోత్ రేట్ దేశంలోనే ఏపి మొదటి స్థానంలో నిలిచింది.   33వేల ఎకరాలను రైతులు అమరావతి కోసం ఇస్తే అన్నీ పనులు నిలిపివేశారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాజధాని ప్రజలు అయోమయంలో పడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పథకాలు, ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.    


 పోలవరం జాతీయ ప్రాజెక్టు.. కేంద్రం నిధులు విడుదల చేస్తుంది,  మేం ప్రాజెక్టును అత్యంత వేగంగా చేయాలని  టేకప్ చేశాం.. 73% నిర్మాణం చేశాం, మేమెక్కడ నిర్లక్ష్యం చేయలేదు. ఈ రోజు వున్న అనిశ్చిత పరిస్థితుల్లో కేంద్రమే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకోండి.  ప్రధాని మోదీ,  కేంద్ర మంత్రి షెకావత్ గారు స్పందించి పోలవరంను టేకోవర్ చేయండి. కేంద్రం బాధ్యత తీసుకుంటే ఏడాదిన్నరలోగా పనిపూర్తి  చేసి పోలవరం నీటిని విడుదల చేయవచ్చు.  పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పోలవరం ఆలస్యమైతే సంవత్సరానికి రూ.300 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు మీద కక్ష సాధింపుతో పోలవరాన్ని జగన్ ఇబ్బందుల్లోకి నెడుతున్నారని విమర్శించారు. కేంద్ర నిధులు కాబట్టి, జగన్ వ్యవహారం తేడాగా ఉంది కాబట్టి కేంద్రమే పోలవరాన్ని చేపట్టాలని నేను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నా. పోలవరం ప్రాజెక్టు చేపడితే కేంద్రానికి మంచిపేరు వస్తుంది. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు  కాబట్టి కేంద్రం పోలవరాన్ని చేపట్టే దిశగా ఆలోచన చేయాలి. పోలవరం కేంద్రం చేపట్టాలని గతంలో జగనే డిమాండ్ చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు, పోలవరం విషయంలో జగన్ వైఖరి చూస్తుంటే సంక్లిష్టమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. పోలవరం యథాతధంగా చేపట్టి ఉంటే మాకు అభ్యంతరం ఉండేది కాదు. పోలవరం ఆపేసే ప్రసక్తి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ సరికాదని మేము చెప్పడం కాదు.. హైకోర్టే చెప్పింది. పంతానికి పోయి పోలవరం ప్రాజెక్టును దిక్కులేని ప్రాజెక్టుగా మార్చొద్దు.  నవయుగ ఒక్క రోజులో వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి గిన్నీస్ రికార్డులకెక్కింది. మాట వెనక్కిపోను, మడమ తిప్పమని చెప్పే జగన్మోహన్‌రెడ్డి మీ వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది. చంద్రబాబు మీద, టీడీపీ మీద కోపంతో ప్రాజెక్టులపై కక్ష సాధించవద్దు. రాజధాని, పోలవరం విషయంలో జగన్ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోతున్నాయని, పనులన్నీ ఆపేసి ఆకాశం వైపు చూసే పరిస్థితులు ఉన్నాయి. పోలవరం, రాజధాని విషయాల్లో జ్రాగత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. 


 జగన్ రావాలి..  జగన్ కావాలి అంటే ఇప్పుడు అన్నీ కూల్చాలి.. అందరినీ తిట్టాలి అనేలా పాలన ఉందని విమర్శించారు. జగన్ తన తీరును మార్చుకుని రైతులు,  ప్రజలకు మేలు జరిగేలా చూడాలి. మంచి పాలన అందించాలని గెలిపిస్తే, జగన్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. రూ.5కు అన్నం దొరకకుండా చేసిన పాపం జగన్‌ది. ఇసుక లేకుండా చేసి లక్షల మంది ప్రజలను పస్తులు ఉండేలా చేశారు. ఎకనామిక్ టెర్రరిస్ట్ అనే స్థాయిలో చెడ్డ పేరు తెచ్చుకోవడం దేనికి? జపాన్ వంటి దేశాలు రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో కేంద్రానికి లేఖలు రాసే పరిస్థితి తెచ్చుకోవడం దేనికి? 



 రాజధానిలో వరద లేదు..  వంకాయ లేదు.. 12లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా అమరావతికి ఏమి  జరగదు. వరద పేరుతో వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది.. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిని పూర్తి చేయాలని కోరుతున్నాం.