పవన్ కళ్యాణ్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న వైకాపా

అంతిమతీర్పు. 23.8.2019


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పై  అసత్య ఆరోపణలు చేస్తూన వైయస్సార్సీపి    సోషల్ మీడియా విభాగం పై విచారించి  కఠిన చర్యలు తీసుకోవాలని   ఈ రోజున జనసేన పార్టీ పశ్చిమ , మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి లు పోతిన వెంకట మహేష్,అక్కల గాంధీ మరియు జియాఉర్ రెహ్మాన్ గుంటూరు జిల్లా నాయకులు విజయవాడ సీపీ ఆఫీస్ వద్ద నున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఇన్స్పెక్టర్ కె . శివాజీ గారికి కంప్లైంట్ చేసినారు.ఈ సందర్భంగా మీడియా తో మహేష్ మాట్లాడుతూ  వైయస్సార్సీపి అధికారికంగా నిర్వహించే సోషల్ మీడియాలో ఏ మాత్రం ఆధారం లేని అసత్య కుట్రపూరితమైన సమాచారాన్ని ప్రచారం చేస్తూ నీతి నిజాయితీ నిబద్ధత పనిచేస్తు సమాజంలో మార్పు తేవాలని వారి వ్యక్తిగత ఆదాయాన్ని కూడా వదులుకొని సమాజ హితం కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ జనసేన పార్టీని మరియు పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న లక్షలాది కార్యకర్తల  సేవలను కించపరిచే విధంగా , జనసేన పార్టీకి కి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ద్వారా వచ్చిన బలమైన ఓటు బ్యాంకు తగ్గించాలని సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించకుండా ఉండే కుట్రలో భాగంగానే  వైయస్సార్సీపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అట్లాగే 100 రోజుల ప్రభుత్వ పాలన పై కూడా స్పందిస్తానని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించ బట్టే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైస్సార్సీపీ ప్రభుత్వం పాలన పైన రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాలని పాలన చేత కాకై  ఇటువంటి అవాస్తవ లను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో  మైలవరం ఇంచార్జ్ అక్కల .గాంధి,గుంటూరు నాయకులు జియా ఉఉల్ రెహ్మాన్,లక్ష్మణ్  రావు,పవన్ ,అమీర్ బాషా,సంతోష్ కుమార్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు .