గుంటూరు జిల్లాలో పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు

.
      


గుంటూరు అర్బన్ లో ఈరోజు అనగా ది.31-08-19 వతేదీన పదవీ విరమణ చేయుచున్న


1) గుంటూరు అర్బన్ సిసిఎస్ అడిషనల్ ఎస్పీ శ్రీ  ఎం వెంకటేశ్వర్లు 
2) గుంటూరు అర్బన్ ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి  శ్రీ ఎస్ఎమ్  నాజీమ్ ఉద్దీన్ , 
3) అర్బన్ సాయుధ దళం ఆర్ఎస్ఐ కె ఆనందరావు 
4) లాలాపేట స్టేషన్ ఎఎస్ఐ శ్రీ ఏ నాగేశ్వర రావు
5) నల్లపాడు స్టేషన్ హెచ్.సి జి.మల్లికార్జునరావు
గార్లకు అర్బన్ నూతన సమావేశ మందిరంలో అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి రామకృష్ణ గారి ఆధ్వర్యములో ఘనంగా సన్మానించారు.


అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎమ్. వెంకటేశ్వర్లు గారు 1985 వ సంవత్సరములో ఆర్ఎస్ఐ గా ఎంపిక కాబడి యూసుఫ్ గూడా ఒకట వ బెటాలియన్ నందు ట్రైనింగ్ అయి, 1989 వ సంవత్సరంలో సివిల్ ఎస్ఐ గా కాన్వర్షన్ అయ్యి అనంతపురం పి.టి.సి. నందు ట్రైనింగ్ అయ్యి, 2001లో సిఐ గా ప్రమోషన్ పొంది , 2011 లో డిఎస్పీ గా ప్రమోషన్ మరియు 2014 లో అదనపు ఎస్పీ గా ప్రమోషన్ పొందినారు. వీరు మహబూబునగర్ , నల్లగొండ , గుంటూరు రూరల్ మరియు అర్బన్  జిల్లాల్లో మొత్తం మొతం 34 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసినారు.


ఈస్ట్ డిఎస్పీగా పనిచేసిన ఎస్ఎమ్ నాజీమ్ ఉద్దీన్ గారు 1989 లో సివిల్ ఎస్ఐగా ఎంపిక కాబడి అనంతపురం నందు శిక్షణ పొంది సీఐగా 1999 లో, డిఎస్పీగా 2011లో ప్రమోషన్ పొంది హైదరాబాద్ లోని సౌత్ జోన్ , సెంట్రల్ జోన్ లనందు , కర్నూలు డిఎస్పీగా , కర్నూల్ ఎస్బి డిఎస్పీ గాను మరియు  గుంటూరు ఈస్ట్ డిఎస్పీ గా మొత్తం 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ చేయుచున్నారు.


 ఆర్ఎస్ఐ ఆనంద రావు గారు 1981లో ఎఆర్ కానిస్టేబుల్ గా గుంటూరు జిల్లా నుండి ఎంపిక కబడి మంగళగిరి బెటాలియన్ లో ట్రైనింగ్ పొంది, 1992 ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా , 2008లో ఎఆర్ఎస్ఐ గా మరియు ఆర్ఎస్ఐ గా 2013 సంవత్సరంలో పదోన్నతులు పొంది గుంటూరు , నెల్లూరు గుంటూరు అర్బన్ జిల్లాలో మొత్తం 39 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినారు.


ఎఎస్ఐ బండి నాగేశ్వర రావు గారు 1984 వ సంవత్సరము లో కృష్ణా జిల్లా నందు సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక కాబడి కురిచేడు నందు ట్రైనింగ్ పూర్తి చేసి కృష్ణా జిల్లాలో పనిచేసి ,  అచ్చట నుండి గుంటూరు జిల్లాకు 1990లో ట్రాన్స్ఫర్ పై వచ్చిన వీరు 2012 లో హెడ్ కానిస్టేబుల్ గా , 2018లో ఎఎస్ఐ గా పదోన్నతులు పొందిన వీరు మంగళగిరి టౌన్,  రేపల్లె , ముప్పాళ్ళ, లాలాపేట పోలీస్ స్టేషన్లలో పనిచేసి మొత్తం 39 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేశారు.


 నల్లపాడు హెడ్ కానిస్టేబుల్  గోపిశెట్టి మల్లికార్జునరావు 1990 లో సివిల్  కానిస్టేబుల్ గా సెలెక్ట్ కాబడి, బాపట్ల విజిలెన్సు డిపార్ట్మెంట్ , ఎడ్లపాడు, లాలాపేట , మంగళగిరి టౌన్ , నల్లపాడు స్టేషన్ లలో పనిచేశారు. 2013 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు.


ఈకార్యక్రమములో అదనపు ఎస్పీ వై టి నాయుడు, ఆర్ఐ లు విజయసారధి , భగవాన్ గార్లు , సిఐ లు ఎస్వి రాజశేఖర్ రెడ్డి ,సురేష్ బాబు , షైక్ థెరిసా  ఫిరోజ్ , ఎస్ఐ లు బ్రహ్మానందం ,సమీర్ బాషా పోలీసు అధికారుల సంఘం సభ్యులు లు హుస్సేన్  బేబీ రాణి కరీముల్లా లక్ష్మయ్య , జానయ్య ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దళవాయి సుబ్రమణ్యం అం అం పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమము ఆనంతరము కుటుంబ సభ్యులతో పాటుగా అందరిని పోలీస్ వాహనాలలో వారి వారి నివాసాలు వెళ్లే ఏర్పాట్లు చేసినారు. రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఘనంగా నిర్వహిస్తున్నందుకు పోలీస్ అసోసియేషన్ వారు అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఐపిఎస్., గారికి ధన్య వాదములు తెలిపినారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image