ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు


అమరావతి: అతి త్వరలో రాష్ట్రంలో రోడ్లపై విద్యుత్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. ఈ బస్సులతో గాలి, ధ్వని కాలుష్యం తగ్గనుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏపీకి 300 విద్యుత్‌ బస్సులను కేటాయించింది. డీజిల్‌ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఏటా రూ.300 కోట్ల వరకు నష్టాల్ని చవిచూస్తోంది. దీంతో ఇప్పటివరకు డీజిల్, సీఎన్‌జీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ నిర్వహణ వ్యయం తగ్గించేందుకు విద్యుత్‌ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే విద్యుత్‌ బస్సుల నిర్వహణపైన నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. డీజిల్‌ బస్సులు నడపడం వల్ల కిలోమీటరుకు డ్రైవర్‌ జీతభత్యంతో కలిపి రూ.38 వరకు ఖర్చవుతుంది.  అదే విద్యుత్‌ బస్సు నిర్వహణ ఖర్చు కిలోమీటరుకి రూ.19 వరకే అవుతుందని నిపుణుల కమిటీ తేలి్చంది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌–2 (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇన్‌ ఇండియా) పథకం కింద దేశంలో 64 నగరాలకు 5,595 విద్యుత్‌ బస్సులను మంజూరు చేయగా, ఏపీకి 300 విద్యుత్‌ బస్సులు కేటాయించింది. విశాఖపట్నంకు వంద, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడలకు 50 చొప్పున మంజూరు చేశారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.2.18 కోట్ల వరకు ఉండగా.. కేంద్రం 40% రాయితీ ఇవ్వనుంది. విద్యుత్‌ బస్సులో సీసీ కెమెరాలు, 31 సీట్ల సామర్థ్యం, ఆటోమేటిక్‌ గేర్లు ఉంటాయి. రెండు గంటలు చార్జింగ్‌ చేస్తే నిరంతరాయంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు బస్సు నడుస్తుందని ఆర్టీసీ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.  
700 బస్సుల కోసం ప్రయత్నాలు : రాష్ట్రంలో ఈ ఆరి్థక సంవత్సరంలోనే వెయ్యి విద్యుత్‌ బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ గతంలోనే ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. వెయ్యి బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ (డీహెచ్‌ఐ)కు జూన్‌లోనే ప్రతిపాదనలు సమరి్పంచింది. విద్యుత్‌ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యూ అండ్‌ రెనెవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ), ఏపీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు (యూఐటీపీ) సహకారం అందిస్తాయి. ఇప్పటికే 300 బస్సులను కేటాయించడంతో మిగిలిన 700 బస్సుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  
ఆర్టీసీ విలీనంపై ఎలాంటి అనుమానాలొద్దు : ఆర్టీసీ విలీనంపై కార్మికులు ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవద్దని, రెండు నెలల్లో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) నేతలకు స్పష్టం చేశారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతలు రవాణా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు అధికారులు అడ్డుపడుతున్నారని, యాజమాన్యం సమస్యల పరిష్కారంలో ఏకపక్షంగా ముందుకు వెళుతోందని మంత్రికి వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విలీనం హామీ ఇచ్చారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం వెనక్కు వెళ్లరని తమకు ప్రగాఢ నమ్మకం ఉందన్నారు. ఇందుకు మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆర్టీసీని విలీనం చేసి ప్రయాణిస్తే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్న విధంగా సంస్ధను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పెన్షన్‌ సౌకర్యం వర్తింపజేస్తామన్నారు. ఆర్టీసీ నిర్వహణ భారం తగ్గించేందుకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. విలీనం జరిగిన తర్వాత ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఈయూ నేతలు వైవీ రావు, దామోదరరావు, కె.బాలాజీ తదితరులున్నారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..