కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్‌ కార్యక్రమం కింద కలవాలి: ప్రతి మంగళవారం ఇద్దరూ కలవాలి:


భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇచ్చిపుచ్చుకోవాలి:
ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలి:
గురువారం తహశీల్దార్, ఎస్సై, సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్వోలు కలిసి కూర్చోవాలి
భూవివాదాల పరిష్కారానికి దృష్టిపెట్టాలి:
చాలా చోట్ల భూవివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారిందన్న సీఎం
ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీల ప్రతిపాదనలు బాగున్నాయన్న సీఎం
మిగతా అధికారులు పాటించాలన్న సీఎం
మళ్లీ చెప్తున్నా.. ఎక్కడా అవినీతి ఉండకూడదు:


సెప్టెంబరులో నాణ్యమైన బియ్యం పంపిణీ శ్రీకాకుళంలో మొదటగా ప్రారంభం:
ఇప్పటివరకూ ఇచ్చే బియ్యంలో నాణ్యత లేక ప్రజలు తినడంలేదు:
ప్రజలు తినగలిగే బియ్యాన్ని ఇవ్వాలి:


చిత్రావతిలో నీళ్లు నిలపాలని ఆదేశించా:
దీనికి రూ.52 కోట్లు కావాలని కలెక్టర్‌ అడిగితే వెంటనే ఇవ్వమని చెప్పాను:


స్పందన రివ్యూ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.