కడప : మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. వైఎస్ కుటుంబసభ్యులను మరోసారి సిట్ బృందాలు ప్రశ్నించాయి. పులివెందులలో ఇప్పటి వరకు 300 వందల మందికి పైగా... అనుమానితులను పోలీసు బృందాలు విచారించాయి. త్వరలో కీలక సూత్రధారులతో పాటు మరిన్ని అరెస్ట్లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పులివెందులలో సొంత నివాసంలోనే వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
వైఎస్ వివేకా హత్యకేసులో సిట్ విచారణ వేగవంతం