నిన్ను ప్రేమించని క్షణం లేదు’ : నారా లోకేశ్‌


హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దంపతులు సోమవారం తమ 12వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య బ్రాహ్మణిపై తనకున్న ప్రేమను ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. '12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు.. నా హృదయం లోపలి నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి నారా' అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'మీ ఆనందమైన ఈ జీవితం చిరకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. పెళ్లి రోజు శుభాకాంక్షలు'.. 'అన్న, వదినకు పెళ్లిరోజు శుభాకాంక్షలు'.. 'హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ'.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. 2007లో వివాహబంధంతో ఒక్కటైన వీరికి కుమారుడు దేవాన్ష్‌ ఉన్నాడు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image