కేవలం డిగ్రీ లతోనే ఉద్యోగాలు రావు

అమరావతి : కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావని.. అదనపు నైపుణ్యాలు పెంపొందించుకున్నపుడే మార్కెట్ లో పోటీని తట్టుకుని ఉద్యోగాలు సాధించగలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఎస్‌డిసి), స్వర్ణభారత్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన యువసాధికారత- నైపుణ్య శిక్షణలు- ఆవశ్యకత- అవకాశాలు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. 
ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ లోని స్కిల్ డెవప్మెంట్ సెంటర్ ను సందర్శించాక ఇలాంటిది ప్రతి జిల్లాలో ఉంటే ఎంతో బాగుంటుందన్న భావన కలిగిందన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75శాతం ఉద్యోగాలు కల్పించాలన్న చట్టాన్ని తీసుకువచ్చారని.. అందుకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకునేందుకు తమ  వంతు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ విషయంలో చొరవ చూపాలని ఆయన కోరారు. అనంతరం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన యువత ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎపిఎస్‌ఎస్‌డిసి, స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాలను ఆయన అబినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు శిక్షణతోపాటు ఉపాధి కల్పించేడమే లక్ష్యంగా ఎపిఎస్‌ఎస్‌డిసి పనిచేయాలని ఆయన సూచించారు. మన దేశ జనాభాలో 25ఏళ్లలోపు యువత 84శాతం ఉన్నారని.. ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఇంతమంది యువత లేరని.. వారే మన దేశానికి వెన్నుముకలాంటివారన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావని.. అదనపు నైపుణ్యాలు పెంపొందించుకున్నపుడే మార్కెట్ లో పోటీని తట్టుకుని ఉద్యోగాలు సాధించగలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యతక ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలో ఏదేశంలో లేని విధంగా మన దేశంలో 35ఏళ్లలోపు యువత 65శాతం ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటి యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయరంగం నుంచి అన్ని రంగాల వారికి నైపుణ్య శిక్షణ అవసరమని.. దీని ఆవశ్యకతను గుర్తించిన ప్రధాని మోడీ కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థలతో కలిసి అనేక శిక్షణా కార్యక్రమాలు అమలవుతున్నాయని వెంకయ్య గుర్తు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.  ప్రపంచ దేశాల్లో పర్యటించినపుడు ఆనందంగా ఉంటే.. స్వర్ణభారత్ ట్రస్ట్ కు వచ్చినపుడు పొందే ఆనందమే ఎక్కువని  వెంకయ్య అన్నారు. ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసితో కలిసి స్వర్ణభారత్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఇక్కడ శిక్షణ పొందుతున్న యువతతోపాటు ఇంజనీరింగ్ యువతకు కూడా స్పూర్తినిస్తాయన్నారు. తన సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎపిఎస్‌ఎస్‌డిసికి ఎప్పుడూ ఉంటుందని కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నాతన వంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి, స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు సర్టిఫికెట్లను అందజేశారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తదితరులు ఎపిఎస్‌ఎస్‌డిసి, స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image