రేపు హైదరాబాద్‌ రానున్న పీవీ సింధు


హైదరాబాద్‌: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తార పీవీ సింధు మంగళవారం హైదరాబాద్‌కు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె నగరానికి చేరుకుంటుందని సమాచారం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్విట్జర్లాండ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. సింధు రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో  రెండేళ్ల క్రితం తనకు స్వర్ణం దూరం చేసిన జపాన్‌ క్రీడాకారిణి నొజొమి ఒకుహరను సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో చిత్తుగా ఓడించింది. దూకుడుగా ఆడింది. తన పదునైన స్మాష్లతో విరుచుకుపడింది. ఛాంపియన్‌షిప్‌లో సింధు ఇంతకు ముందు 2 కాంస్యాలు, 2 రజతాలు గెలుచుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తదితరులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. భారత బ్యాడ్మింటన్‌ సంఘం రూ.5 లక్షల బహుమానంగా ప్రకటించింది.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image