రైతులు నేరుగా వారి సమస్యలు చెప్పుకోవచ్చు


అమరావతి : అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా వ్యవసాయ మిషన్‌కు వచ్చి వారి సమస్యలను తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రైతు సమస్యను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. రైతుల సమస్యలను ప్రతి నెలా అగ్రికల్చర్‌ మిషన్‌లో సీఎంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. రైతులు ఎప్పుడైనా వారి సమస్యలు చెప్పుకునేలా మిషన్‌ను రూపొందిస్తున్నామని అన్నారు.