ఆంధ్రప్రదేశ్ మహిళా గవర్నర్ ను పరమాశించిన తెలంగాణ గవర్నర్ దంపతులు

విజయవాడ, ఆగస్టు 29... మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళా గవర్నర్ శ్రీమతి సుప్రవ హరిచందన్ ను తెలంగాణ గవర్నర్  శ్రీ ఇఎస్ఎల్ నరసింహన్‌, మహిళా గవర్నర్ శ్రీమతి విమల నరసింహన్ లు  గురువారం పరామర్శించారు.  హైదరాబాద్ ఆసుపత్రిలో ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళా గవర్నర్ ఆరోగ్య పరిస్ధితి మెరుగు పడుతుండగా, ఆసుపత్రికి వచ్చిన గవర్నర్ దంపతులు సుప్రవ హరిచందన్ ఆరోగ్య పరిస్ధితి గురించి అరా తీసారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యనీయ బిస్వ భూషన్ హరిచందన్ తెలంగాణా గవర్నర్ దంపతులతో మాట్లాడుతూ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆమె వేగంగా కోలుకుంటున్నారని వివరించారు. నరసింహన్ దంపతులు శ్రీమతి సుప్రవ హరిచందన్ త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షించారు.