ఇకపై గిడ్డంగులే మార్కెట్ యార్డులు.. * డబ్ల్యుడిఆర్ఏ ఛైర్మన్ బి.బి.పట్నాయక్

ఇకపై గిడ్డంగులే మార్కెట్ యార్డులు..
* డబ్ల్యుడిఆర్ఏ ఛైర్మన్ బి.బి.పట్నాయక్ 
విజయవాడ : రైతులు పండించిన పంటను నిల్వచేసే గోడౌన్ల వద్దే అమ్ముకునే విధంగా గిడ్డంగులను మార్కెట్ యార్డులుగా మలచుకోవాలని కేంద్ర మార్కెట్ వేర్ హౌసింగ్ డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యుడిఆర్ఏ) చైర్మన్ బి.బి.పట్నాయక్ అన్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ (ఇనామ్) మరియు ఎలక్ట్రానిక్ నేషనల్ వేర్హౌసింగ్ రిసీప్ట్ (ఇఎన్డబ్ల్యుఆర్)ల మధ్య రిజిస్ట్రేషన్, సమన్వయంపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖ, ఎన్ఐఎఎం జైపూర్ సంయుక్తంగా రైతులకు గిడ్డంగుల యజమానులు వ్యాపారులకు అధికారులకు ఒకరోజు వర్కుషాపును శనివారం విజయవాడలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన డబ్ల్యుడిఆర్ఏ ఛైర్మన్ బి.బి.పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర గిడ్డంగులు (ఎస్డబ్ల్యుసిలు), కేంద్ర గిడ్డంగులు (సిడబ్ల్యుసిలు) ప్రైవేటు గిడ్డంగులు ఇతర గిడ్డంగులన్నీ కూడా ఇనామ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు మార్కెట్ యార్డులుగా అనుమతించిన గిడ్డంగులలోనే తమ పంటలను నిల్వ చేసుకొని ఎటువంటి అదనపు అదనపు ఖర్చులు లేకుండా మంచి ధరకు విక్రయించుకోవాలని సూచించారు. ఇనామ్ ఇఎన్డబ్ల్యుఆర్ లను అనుసంధానంచేస్తే రైతులు మంచి రేటుకు పంటలను అమ్ముకునే అవకాశం కలుగుతుందన్నారు. దీనివల్ల రైతు ధర ఎక్కడ ఎక్కువ ఉందో తెలుసుకొని అమ్ముకొనే అవకాశం అలాగే వ్యాపారులు కూడా ఎక్కడ ఏ ఉత్పత్తులు ఉన్నాయో తెలుసుకొని కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్లో 23 గిడ్డంగులను మార్కెట్ యార్డులుగా ప్రకటించి చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలో పంటలు ఎక్కువగా పండుతాయని దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు దేశ వృద్ధిరేటు పెరగడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గిడ్డంగులు నిర్మించేవారికి వారి సిబ్బందికి ఎంతమందికైనా తమ సంస్థద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇనామ్ వ్యవస్థ ద్వారా ఏర్పాటయ్యే డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా రాష్ట్రంలోని రైతులు తమ ఉత్పత్తులను రాష్ట్ర సరిహద్దులు దాటి అమ్ముకోవచ్చన్నారు. తమిళనాడులో సుమారు 450 సహకార సంఘాల గిడ్డంగులను రిజిష్టరుచేసి ఇఎన్డబ్ల్యుఆర్తో అనుసంధానం చేశారన్నారు. ఈ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో రైతులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. గిడ్డంగులు నిర్మించేవారు ఇనామ్ వ్యవస్థలో రిజిష్టర్ చేసుకొని ఇఎన్డబ్ల్యుఆర్ తో అనుసంధానం కావాలన్నారు. కేంద్ర మార్కెటింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ పి.కె.స్వయిన్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి గోడౌను యజమానులు నిర్వాహకులు ఇనామ్లో రిజిష్టరు చేసుకొని ఇఎన్డబ్ల్యుఆర్ తో అనుసంధానం కావాలన్నారు. రైతు శ్రేయస్సుకోసం కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే పంటలను ఆన్ లైన్ ద్వారా అమ్ముకొనే అవకాశం కల్పించిందన్నారు. ఆన్ లైన్లో రైతులు తమ ఉత్పత్తులను మంచి రేటుకు అమ్ముకోవచ్చని కొనుగోలుదార్లు కూడా ప్రపంచంలో ఎక్కడ నుండైనా ఇనామ్ ద్వారా కొనుగోలు చేయొచ్చన్నారు. రైతులు తమ ఉత్పత్తులను గోడౌన్లలో నిల్వ చేసుకొని ఎలక్ట్రానిక్ నేషనల్ వేర్హౌస్ రిసీప్టుల ద్వారా బ్యాంకుల నుండి రుణాలు కూడా పొందవచ్చన్నారు. రైతులు, వ్యాపారులు మొబైల్ యాప్ ద్వారా కూడా తమ ఇంటివద్దనుండే నాణ్యతను పరిశీలించుకొని అమ్మకాలు కొనుగోళ్ళు చేసుకొని మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చన్నారు. గుంటూరు మార్కెట్ దేశంలోనే అతిపెద్ద ఇనామ్ మార్కెట్ అని మిర్చి ట్రేడింగ్లో ఆసియాలో అతి పెద్దదని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇనామ్ను విజయవంతంగా అమలుచేస్తున్నందుకు ఆశాఖ స్పెషల్ సెక్రటరీ మదుసూదనరెడ్డి, స్పెషల్ కమీషనర్ పి.ఎస్. ప్రద్యుమ్నను పట్నాయక్, స్వయిన్ అభినందించారు.
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం... 
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మదుసూదన రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని గిడ్డంగులను మార్కెట్ యార్డులుగా ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. రైతులు తాము పండించిన పంటలలో నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి గిడ్డంగులకు తీసుకు రావడానికి ముందే శుభ్రంచేసి, గ్రేడింగ్ చేసి తీసుకు వస్తే గిడ్డంగుల దగ్గరకు తీసుకు వచ్చిన తరువాత బాగుచేయడానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని సూచించారు. గిడ్డంగుల యజమానులు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అదేవిధంగా వ్యాపారులు కూడా రైతులకు ఎక్కువ ధర వచ్చేలా కృషిచేయాలని చెప్పారు. తద్వారా రైతులు వ్యాపారులు గిడ్డంగుల నిర్వాహకుల మధ్య పరస్పరం నమ్మకం కుదురుతుందన్నారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image