శ్రీకాకుళం జిల్లాల్లో ఫైలెట్ గా రేషన్ బియ్యం


తేది: 28.082019
అమరావతి


సెప్టెంబరులో శ్రీకాకుళం జిల్లాల్లో ఫైలెట్ గా రేషన్ బియ్యం ఇంటింటా పంపిణీకి శ్రీకారం


•  గ్రామ వాలంటీర్లచే 5,10,15,20 కిలోల బ్యాగులతో ఉన్న బియ్యం పంపిణీ. 


•  వచ్చే ఏప్రిల్ నుండి రాష్ట్రమంతటా నాణ్యమైన బియ్యం పంపిణీకి చర్యలు


•  80 శాతం స్వర్ణ రకం,20 శాతం ఇతర రకంతో కూడిన బియ్యం అందిస్తాం


•  ఆహారభద్రత కార్యక్రమంలో భాగంగా నాణ్యమైన బియ్యం పంపిణీకి చర్యలు


•  నూతన విధానంతో రేషన్ డీలర్లు ఎవరినీ తొలగించబోము:రాష్ట్ర పౌరసరఫరాలశాఖమంత్రి కొడాలి నాని


అమరావతి,ఆగస్టు28: ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు సెప్టెంబరు మొదటి వారంలో శ్రీకాకుళం జిల్లాలో రేషన్ కార్డుదారులకు నాణ్యతో కూడిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఫైలెట్ ప్రాజెక్టుగా లాంఛనంగా ప్రారంభిచనున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) వెల్లడించారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం నాలుగవ బ్లాకులోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాణ్యతపరంగా స్వర్ణ బియ్యంతో సరితూగే సమానమైన ఇతర రకాలను ఎంపికచేసి ఖచ్చితమైన తూకముతో కూడిన ప్యాకెట్ల రూపంలో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా కార్డుదారుల ఇంటికే బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాల్లో సెప్టెంబరు మొదటివారంలో శ్రీకారం చుట్టడం జరుగు తుందన్నారు. ఆ జిల్లాలో నెలకు 15 వేల టన్నుల బియ్యం అవసరం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రజా పంపిణీ ద్వారా పంపిణీ చేసే బియ్యం వివిధ రకాల వెరైటీలు కలగాపులగమై స్వర్ణ రకాన్ని మిగిలిన రకాలను విడదీయడం సాధ్యం కాని పరిస్థితి ఉందని తెలిపారు. నూకలు 25 శాతాన్ని 15 శాతానికి, రంగుమారిన చెడిపోయిన గింజల శాతం 6 శాతాన్ని1.5 శాతానికి, చాకి గింజల 3 శాతాన్ని1.5 శాతానికి తగ్గించడంతోపాటు 13 శాతం పాలీష్ ను 10 శాతానికి తగ్గించి నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాని పేర్కొన్నారు.


  రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా కోటి 40 లక్షల మంది రేషన్ కార్డుదారులకు సుమారు 11వేల కోట్ల రూ.లు విలువైన బియ్యం కిలో రూపాయికే పంపిణీ చేస్తున్నందున మద్యదళారుల ప్రమేయం లేకుండా తూకాల్లో తేడాలు లేకుండా మెరుగైన రీతిలో బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డుదారుల్లో 92లక్షల మంది కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా మిగతా 55 లక్షల మంది కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు.వచ్చే ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో నాణ్యమైన బియ్యం అందించనున్నందున పాలిథిన్ బ్యాగులస్థానే పూర్తి పర్యావరణహితమైన బ్యాగులతో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకుగాను నెలకు 2 కోట్ల బ్యాగులు సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు ఒక సంస్థకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామ,వార్డు వాలంటీర్ల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇంటింటా పంపిణీ చేపట్టినప్పటికీ ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లు ఎవరినీ తీయబోమని మంత్రి నాని స్పష్టం చేశారు.


రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమీషనర్ మరియు ఇన్చార్జి కార్యదర్శి కె.శశిధర్ మాట్లాడుతూ ప్రజలు తినదగే విధమైన స్వర్ణ లేదా దానికి దగ్గరగా ఉండే నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.సెప్టెంబరు మొదటి వారంలో శ్రీకాకుళం జిల్లాల్లో ఫైలెట్ ప్రాజెక్టుగా లాంచనంగా ప్రారంభించి వచ్చే ఏప్రిల్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించనున్నందున అందుకనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని సమకూర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో 11లక్షల 40వేల మెట్రిక్ టన్నుల వరకూ బియ్యం నిల్వలు ఉండగా వాటిలో 90 శాతం వరకూ స్వర్ణ బియ్యంతో ఇతర రకాల బియ్యం కలగలిపి ఉన్నాయని అన్నారు.కాగా వాటిలో లక్ష టన్నుల వరకూ స్వర్ణ రకం బియ్యంతో ఇతర రకాల బియ్యం తక్కువ కలగలపి ఉన్నాయని పేర్కొన్నారు.2015-16 నుండి డీసెంట్రలైజ్డ్ విధానంలో భాగంగా ఎక్కడ పండే పంటను అక్కడే వినియోగించుకోవాల్సి ఉందని మిగతా బియ్యాన్ని భారత ఆహార సంస్థకు ఇస్తుంటామని చెప్పారు.కావున మనం పండించే పంటలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించే చర్యలు తీసుకుంటున్నామని శశిధర్ స్పష్టం చేశారు.అదేవిధంగా ఇకపై స్వర్ణ తరహా అనుబంధ రకాల ధాన్యాన్నేకొనుగోలు చేసేందుకు స్వర్ణ రకం ధాన్యాన్ని రైతులు అధికంగా పండించేలా వారిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఫైలెట్ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేపట్టాక బియ్యంలో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా అనే అంశంపై  ప్రజలు, ప్రతిపక్షాలు తదితరుల నుండి స్పందనను తీసుకుని మరింత నాణ్యమైన బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలలో ప్లాస్టిక్ సంచుల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టినప్పటికీ భవిష్యత్తులో పర్యావరణ హితమైన బ్యాగుల ద్వారా బియ్యం పంపిణీ చేసేందుకు పేపర్ లేదా క్లాత్ బ్యాగులను వినియోగించడం జరుగుతుందన్నారు.


గ్రామ వాలంటీర్లు రేషన్ బియ్యాన్ని వారి పరిధిలోని 50ఇళ్ళలో ఇంటింటికీ వెళ్ళి కార్డుదారులకు అందించేందుకు వీలుగా వారికి రవాణా ఖర్చుల కింద నెలకు అదనంగా 500 రూలను ఇవ్వనున్నట్టు కమీషనర్ శశిధర్ తెలిపారు. అంతేగాక ఇంటింటీ బియ్యం పంపిణీ చేసి లబ్దిదారుల వేలిముద్రలు సేకరించి అథంటికేషన్ చేసేందుకు వీలుగా ప్రతి వాలంటీరుకు ఒక ఇపోస్ యంత్రంతోపాటు స్మార్ట్ ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.ఐటి ఆధారిత సేవల అనుసంధానంతో ప్రత్యేక యాప్ ను రూపొందించి కార్డుదారులకు వారి సరుకులు పంపిణీకి సంబంధించిన సంక్షిప్త సందేశాలను,వాయిస్ సందేశాలను అందించేందుకు కూడా చర్యల తీసుకుంటున్నట్టు చెప్పారు.ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులు స్టాక్ పాయింట్లుగా ఉంటాయని అక్కడి నుండి సరుకులు తీసుకుని వాలంటీర్ ఇంటింటికీ పంపిణీ చేస్తారని అన్నారు.ఒకవేళ వాలంటీర్లు బియ్యం లేదా ఇతర సరుకులు పంపిణీ చేసే సమయంలో ఆ ఇంటిలో లబ్దిదారులు వేరే ప్రాంతాల్లో ఉండి అందుబాటులో లేకుంటే ఆయా లబ్దిదారులు రేషన్ దుకాణానికి వెళ్ళి వారి సరుకులు తీసుకోసుకునే పోర్టబులిటీ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుందని శశిధర్ పేర్కొన్నారు. 


ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.


 


...........


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image