తిరుమల : ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన రిషికేశ్‌లో చాతుర్మాస దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామివారిని సోమవారం టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ప్రసాదాలను స్వామివారికి అందజేశారు. ప్రత్యేకాధికారి వెంట శ్రీవారి ఆలయ ఓఎస్డి పాల శేషాద్రి తదితరులు ఉన్నారు
రిషికేశ్‌లో విశాఖ శారద పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్న ఎవి.ధర్మారెడ్డి