విజయవాడ - గూడూరు ఇంటర్‌సిటీ రేపే ప్రారంభం


నెల్లూరు : విజయవాడ-గూడూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబరు 1వ తేదీన ప్రారంభించటానికి రైల్వే అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతులమీదుగాఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్‌ అంగడి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దక్షి ణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌ నుంచి నడిచే ఈ రైలు సొంతజిల్లా కావటంతో గూడూరు నుంచి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. విజయవాడ-గూడూరు మధ్య రోజూ ఈ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ తిరుగుతుంది. ఈ రైలుకు విజయవాడ డివిజన్‌ అధికారులు 12743/12744 నెంబర్‌ కేటాయించారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి రెగ్యులర్‌ సర్వీసుగా నడుస్తుంది. సెప్టెంబరు 2 నుంచి రోజూ ఉదయం 6 గంటలకు గూడూరులో బయల్దేరుతుంది. ఉదయం 10.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.10 గంటలకు విజయవాడ నుంచి ఈ రైలు వెళ్తుంది. రాత్రి 10.40 గంటలకు గూడూరు చేరుకుంటుంది. ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబరు 1 ఉదయం 9.30 గంటలకు గూడూరులో బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడ వస్తుంది. నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలిలో ఆగుతుంది. ఈ రైలు పూర్తి చైర్‌కార్‌గా ఉంటుంది. మొత్తం 14 బోగీల్లో రెండు గార్డు బోగీలు పోనూ 12 బోగీలు ఉంటాయి. వీటిలో రెండు ఏసీ చైర్‌కార్‌ ఉంటాయి. మిగిలిన 8 బోగీలు నాన్‌ ఏసీ.
ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు తేదీపై రాని స్పష్టత : మరో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఎక్‌ ్సప్రెస్‌ ప్రారంభోత్సవ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. విశాఖపట్నం నుంచి విజయవాడకు నడిచే డబుల్‌ డెక్కర్‌ ఏసీ సూపర్‌ ఫాస్ట్‌ రైలును సెప్టెంబరులోనే ప్రారంభించాల్సి ఉంది. అయితే, తేదీ మాత్రం ఖరారు కాలేదు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..