హోంమంత్రి సాయం


ఈ సాయంత్రం డీజీపీ ఆఫీసు,కోలనుకొండ దగ్గర ఒక ప్రయాణికుడిని ఒక లారీ అతను ఫిట్స్ వచ్చినవని చెప్పి నిర్దాక్షిణ్యంగా జాతీయ రహదారి వెంట దించి వెళ్ళిపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న చాలా మంది ప్రయాణికులు చూస్తూ వెళ్ళిపోయారు.


 కానీ మన గౌరవ హోం మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు ఆపదలో ఉన్న ప్రయాణికుడ్ని గమనించి కాన్వాయ్ని ఆపించి ప్రాథమిక చికిత్స ద్వారా ఆ ప్రయాణికుడు సాధారణ స్థితికి వచ్చేంతవరకు అక్కడే ఉండి తన ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించి ట్రాఫిక్ పోలీసుల ద్వారా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ కు తరలించారు.


అలాగే అతని స్వస్థలమైన నెల్లూరు వెళ్ళడానికి కావలసిన చార్జికి సాయం కూడా చేశారు.


చేసిన సాయం చెప్పుకోవాలనికాదుగాని, స్పుర్తితో మరింతమందికి సాయంఅందాలని మాత్రమే 🙏🏻