ఆధార్, ఈ-కే వై సీ నమోదుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

అంతిమతీర్పు- అమరావతి. 25.8.2019
ఆధార్‌ మరియు కైవేసీ అప్‌డేషన్‌పై ప్రకటన


ఆధార్‌ మరియు కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురైన ఘటనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.


ఆధార్ అప్‌డేట్‌కోసం ప్రజలెవ్వరూ ఆందోళన, ఆదుర్దా పడాల్సిన అవసరంలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వాటిని అప్‌డేట్‌ చేయించుకోవచ్చు ఎటువంటి గడువు లేదు.


స్కూలు పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ తాజా వివరాల నమోదుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదు. 


రానున్న రోజుల్లో స్కూలు పిల్లలు చదువుతున్న పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుంది. అక్కడే ఆధార్ వివరాలు అప్‌డేట్‌ చేయించుకోవచ్చు. 


e-కేవైసీ అప్‌డేట్‌ చేయనంత మాత్రాన రేషప్‌ సరుకులను తిరస్కరించడం అంటూ ఉండదు. ఎక్కడైతే రేషన్‌ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే e-కేవైసి చేసుకోవలెను. e-కేవైసి కొరకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్ళ కూడదు. ఇదివరకు  రేషన్ దుకాణం వద్ద కేవైసి చేయించుకొని ఉంటే మరల చేయించవలసిన అవసరం లేదు.


ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, ఆధార్ కేంద్రాలు వద్ద, మీ సేవ కేంద్రాల వద్ద, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడొద్దని విజ్ఞప్తి. 


అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగులు, మీడియా సంస్థలు ఈ అంశాన్ని ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి.


–  కోన శశిధర్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు