సీఎం జగన్‌కు పయ్యావుల కేశవ్ లేఖ


అమరావతి : హంద్రీనీవా కాలువపై సీఎం జగన్‌కు పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేసి 10వేల క్యూసెక్కుల సామర్ధ్యానికి పెంచాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం హంద్రీనీవాను ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వం హంద్రీనీవా కాలువ వెడల్పును 70శాతం పూర్తి చేసిందని పేర్కొన్నారు. మిగిలిన 30శాతం ప్రభుత్వం పూర్తి చేయాలని లేఖలో పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.