బొత్స ఏం మాట్లాడారో నాకైతే అర్ధం కాలేదు: సోమిరెడ్డి


గుంటూరు : రాజధానిపై స్పష్టత ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బొత్స ఏం మాట్లాడారో తనకైతే అర్ధం కాలేదన్నారు. బొత్స మాటలు అనువాదం చేయించుకుని విందామన్నా అర్ధంకాని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. బాలకృష్ణ అల్లుడు కాబట్టే భరత్‌పై ఏదో ఒక నింద మోపాలని ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత్‌ కంపెనీ భూములు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయో బొత్స చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కిరణ్ ప్రభుత్వంలో బొత్స ఉన్నప్పుడే ఆ భూముల ఎంవోయూ జరిగిందని గుర్తుచేశారు. 14నియోజకవర్గాల్లో సీఆర్డీఏ విస్తరించిందన్నారు. సీడ్‌ కేపిటల్‌, సీఆర్డీఏ పరిధి తెలియకుండా బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు.