విశాఖ: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం విశాఖలో జరిగిన ఎన్ఎస్టీఎల్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ న్యూక్లియర్ సబ్మెరైన్లు తయారు చేసిన అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని కొనియాడారు. చంద్రుడిపై అడుగు పెట్టడం మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. మనపై ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే గుర్తుండిపోయే సమాధానం ఇచ్చేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని.. ఇక దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే చర్చలు ఉంటాయని, మన వ్యవహారాలలో పక్క దేశాలు తలదూరిస్తే సహించేది లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
మనపై ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే...: వెంకయ్యనాయుడు