విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించండి:గంటా


విశాఖ: రాజధాని అమరావతిపై మంత్రుల గందరగోళ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజల్లో అయోమయం నెలకొందని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దీనిపై సీఎం జగన్‌ మౌనం వీడి స్పష్టత ఇవ్వాలని కోరారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడారు. విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరారు. అమరావతి భూకుంభకోణం జరిగితే అధికారంలో ఉన్నవారు తేల్చాలన్నారు. రాజధాని కుంభకోణం ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని గంటా స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు రాజకీయ నాయకులకు ఉంటుందన్నారు. రాజధానిపై అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ అంగీకారం తెలిపారని.. ఎక్కడపెట్టినా 30వేల ఎకరాలు ఉండాలని ఆయన సూచించినట్లు గంటా గుర్తు చేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలోనూ విజయవాడ, గుంటూరువైపే మొగ్గు చూపారన్నారు. అమరావతి వద్ద రూ.9వేల కోట్లు మౌలిక సదుపాయాలకే ఖర్చయిందని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం 30వేల ఎకరాలకు పైగా ఇచ్చిన రైతుల్లో ఎంతో ఆందోళన ఉందని.. దీనిపై ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని గంటా కోరారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image