వైసిపి ప్రభుత్వ నిర్వాకాలే ఆర్ధిక పతనానికి కారణం

వైసిపి ప్రభుత్వ నిర్వాకాలే ఆర్ధిక పతనానికి కారణం
పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తిన మాజీ ఆర్ధికమంత్రి యనమల


రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలన్నీ పూర్తిగా పడిపోయాయి: యనమల
వచ్చే ఏడాదికి జిఎస్ డిపి సింగిల్ డిజిట్ కు పడిపోనుంది.
తలసరి ఆదాయం ఈ ఏడాదిలో దారుణంగా పతనం కానుంది. జగన్ ప్రభుత్వ నిర్వాకాలే ఈ పతనానికి కారణం.
సీఎం జగన్ స్వయంకృత అపరాధాలే రాష్ట్ర ప్రజలకు చేటు.
టిడిపి ప్రభుత్వం వరుసగా 4ఏళ్లు రెండంకెల వృద్ది సాధించింది. తొలిఏడాదే దానిని సింగిల్ డిజిట్ కు దిగజార్చిన ఘనత వైసిపిదే
దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉత్పాదక రాష్ట్రాలు కాగా, ఆంధ్రప్రదేశ్ వినిమయ రాష్ట్రం. మన రాష్ట్రంలో ఇంధన,వస్తు, ఆహారోత్పత్తుల వినియోగం అధికం. 
ఎంత వినియోగం ఉంటే అంత ఆదాయం రాష్ట్రానికి. వినియోగాలు పడిపోతే రాష్ట్ర రాబడి పతనం.
3నెలలుగా వ్యవసాయ కార్మికులకు పనులు లేవు. పారిశ్రామిక శ్రామికులకు ఉపాధి లేదు. పనులు లేక ఆయా వ్యక్తుల ఆదాయాలు పడకేశాయి.
కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెండింగ్ పెట్టారు. ఇసుక కొరత సృష్టించి కూలీల ఆదాయానికి గండికొట్టారు. లక్షలాది కార్మికులను, ఉద్యోగాలను 3నెలలుగా ఖాళీగా ఉంచారు. 
జీవనోపాధులను దెబ్బతీసి రాష్ట్ర రాబడులకు తీరని నష్టం చేశారు. పేదలకు తినడానికి తిండి లేకుండా చేశారు. 
ఆహార వినియోగం, ఇంధన వినియోగం అన్నీ క్షీణించాయి.
దీనితో అన్నిరకాల వినియోగం పడిపోయింది, రాష్ట్ర ఆదాయానికి భారీ గండిపడింది.
ఆదాయాలు లేకపోవడంతో పొదుపు శక్తి సన్నగిల్లింది.
టిడిపి ప్రభుత్వం 5ఏళ్లు రెండంకెల వృద్దిని సాధించింది. తలసరి ఆదాయం రూ.94వేల నుంచి రూ.1,64,000కు పెంచింది.
 జిఎస్ డిపి, తలసరి ఆదాయం బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి, ఏ రాష్ట్రానికైనా పారిశ్రామిక వేత్తలు వస్తారు.
ఈ రెండింటికి గండికొట్టారు కాబట్టే ఏపికి ఎవరూ రావడంలేదు. గత 5ఏళ్లలో వచ్చినవాళ్లు వెళ్లిపోతున్నారు. భవిష్యత్తులో ఏపికి వచ్చే ఆశలు కనిపించడం లేదు.
రాజధాని నగరం అమరావతి పనులు ఆపేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పిపిఏ)ను లిటిగేషన్లు పెట్టారు. 
విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలతో అయినా సీఎం జగన్ కళ్లు తెరవాలి.
కోర్టు తీర్పులు, కేంద్రం హెచ్చరికలు, ట్రిబ్యునల్ ఆదేశాలు విస్మరిస్తే రాష్ట్రం అంధకారమే
పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపేశారు. తండ్రి నియమించిన అధికారినే కొడుకు బదిలీ చేశారు.
తయారీ పరిశ్రమలను వెనక్కిపోతున్నాయి. జపాన్,ఫ్రాన్స్ విదేశాల్లో ఏపిపై విముఖత పెరిగింది.
టిడిపి సాధించిన అభివృద్ధికి ఆర్ధిక, పరిశ్రమల రంగాలపై శ్వేతపత్రాలు, కౌన్సిల్ లో మంత్రి జవాబులే నిదర్శనం. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఎన్ని లక్షల ఉద్యోగాలు సాధించామో వైసిపి మంత్రులే చెప్పారు.
వైసిపి నేతల చేతకానితనం వల్లే ప్రభుత్వాన్ని నడపలేని స్థితి వచ్చింది.
90రోజుల్లోనే రాష్ట్రాన్ని వెనక్కినడిపారు. అభివృద్దిని రివర్స్ చేశారు, ఎకానమీని రివర్స్ చేశారు, ఆదాయాలను రివర్స్ చేశారు, కొనుగోలు శక్తిని, పొదుపుశక్తిని రివర్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నే తలకిందులు చేశారు.
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగం అంతా పడకేసింది. రోడ్ ప్రాజెక్ట్ లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు,హవుసింగ్,బిల్డింగ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ఇతర రాష్ట్రాలనుంచి వలస వచ్చిన కార్మికులంతా వెనక్కిపోయారు.
కరవు,వరదలతో వ్యవసాయరంగ వృద్దిపై దుష్ప్రభావం. టిడిపి హయాంలో 14%వృద్ధి ఉంటే, ఈ ఏడాది సింగిల్ డిజిట్టే..
ఏపిని డీప్ డిప్రెషన్ లోకి వైసిపి ప్రభుత్వం నెట్టింది. 
చంద్రబాబుపై కక్షతో మొత్తం రాష్ట్రాన్నే సర్వనాశనం చేస్తున్నారు. టిడిపిపై అక్కసుతో మొత్తం పేదలపై కత్తికట్టారు. 
ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు.
ప్రజల బాగోగులను గాలికి వదిలేశారు. ప్రతిపక్షాల నేతలను, కార్యకర్తలను హింసిస్తున్నారు.
తప్పుడు కేసులను కోర్టులే నిశితంగా పరిశీలించాలి. అప్పుడే అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది.
అంతిమంగా బాధితులకు న్యాయం చేయాల్సింది కోర్టులే.
యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image