ఇళ్లస్థలాలకు సంబంధించి ఎండార్స్‌మెంట్‌ ఇస్తున్న పద్ధతి మరింత మెరుగుపడాలి


ఇళ్లస్థలాలకోసం దరఖాస్తులు ఇచ్చే ప్రజలు తప్పనిసరిగా సంతృప్తి చెందాలి:
ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి కచ్చితంగా ఇళ్లస్థలాలు ఇవ్వాలి
పలానా తేదీలోగా ఇంటి స్థలం ఇవ్వబోతున్నామని వినతిపత్రం ఇచ్చేవారికి చెప్పగలిగితే వారికి మరింత సంతృప్తికరంగా ఉంటుంది
దీనికి సంబంధించి ఒక ప్రొఫార్మా కూడా పంపుతున్నాం: సీఎం
ఎక్కువ సంఖ్యలో ప్రజలనుంచి వస్తున్న వినతులు ఇళ్లస్థలాలకు సంబంధించినవే: సీఎం
కలెక్టర్లతో ఇదివరకే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయాలను వెల్లడించిన సీఎస్‌


ఇల్లులేనివారికి ఇంటి స్థలం ఇవ్వాలన్నది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం:
ఇంతవరకూ ఇన్ని లక్షలమందికి రాష్ట్రంలో దేశంలో ఎప్పుడూ ఇవ్వలేదు:
ఈ కార్యక్రమాన్ని సగర్వంగా ముందుకు తీసుకెళ్లాలి:
గ్రామాల వారీగా ఇళ్లస్థలాల లబ్ధిదారులను గురించే కార్యక్రమం: కొనసాగుతోందని సీఎంకు వివరించిన అధికారులు
మండలాలవారీగా గ్రామ, వార్డు వాలంటీర్లతో లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టామన్న కలెక్టర్లు
గ్రామ వాలంటీర్లను పాత్ర చురుగ్గా ఉండేలా చూసుకోవాలన్న సీఎం
వాలంటీర్లందరికీ త్వరగా స్మార్ట్‌ ఫోన్లు అందించాలన్న సీఎం
గ్రామ సచివాలయాలతో కలెక్టర్ల అనుసంధానానికి యాప్‌ తయారీపైకూడా ఆరా తీసిన సీఎం, తయారుచేస్తున్నామన్న అధికారులు