జాతీయ రహదారిపై కారు డీ కొని మహిళ మృతి

జాతీయ రహదారి పై కారు డీకొని మహిళ మృతి
తడ. తడ మండలం లోని చేనిగుంట గిరిజన కాలనీ సమీపాన గల జాతీయ రహదారి పై రోడ్డు దాటు చున్న టి. మునెమ్మ (57) అను మహిళ ను చెన్నై నుండి నెల్లూరు వైపు వెళుతున్న కారు వేగంగా డీ కోట్టింది. ఈ గటనలో మునెమ్మ మరణించింది. అందిన సమాచారము మేరకు మునెమ్మ అపాచీ లో పనిచేసుకుని జీవించేది. ఆమె భర్త బాలయ్య రోజు వారి కూలి. శనివారం నాడు కూడా అపాచీ కంపెనీ కి టైం అయిపోతుందని ఉదయం 6గంటల 30 నిముషాల ప్రాంతంలో హడావిడిగా ఏదో పనిమీద రహదారి దాటి పని చూసుకుని తిరిగి ఇంటికి వచ్చే సమయంలో హడావుడిగా రహదారి దాటడంతో వేగంగా వస్తున్న కారు డీ కోని రోడ్డు పై పడింది.   డీ కొట్టిన కారులోని వ్యక్తి హుటాహుటిన సూళ్లూరుపేట లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కాని అప్పటికే మునెమ్మ మరణించిందని డాక్టర్ మరియు హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. తడ పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.