22 భాషల్లో మాట్లాడే అవకాశం కల్పించా

'22 భాషల్లో మాట్లాడే అవకాశం కల్పించా'
ప్రభుత్వాలు మాతృభాషల పరిరక్షణకు కృషి చేయాలి
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
విశాఖ: ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే కొనసాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు మాతృభాషల పరిరక్షణకు కృషి చేయాలని ఆయన సూచించారు. విశాఖ జిల్లా గంభీరంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. మాతృభాషా దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాతూ.. ఆనందం అనిపించినా, బాధ అనిపించినా మాతృభాషలోనే మాట్లాడతామని.. ఇప్పుడు కొందరు ఆ భాషకు దూరమవుతున్నారన్నారు. భాషను కాపాడుకోవడం వల్ల సమాజాన్ని పరిరక్షించుకోవచ్చనే విషయాన్ని ఐరాస చెబుతోందని వెంకయ్య గుర్తు చేశారు. మాతృభాషను ప్రేమించమంటే ఇతర భాషలు వద్దని కాదన్నారు. రాజ్యసభ సభ్యులు 22 ప్రాంతీయ భాషల్లో మాట్లాడే అవకాశాన్ని ఛైర్మన్‌గా తాను కల్పించినట్లు వెంకయ్య వివరించారు. దేశ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి అందాలన్నారు. మన దేశం శాస్త్ర సాంకేతికంగా అనేక ఆవిష్కరణలను సాధ్యం చేస్తోందని చెప్పారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు