చర్మకారులు వృత్తి నైపుణ్యంతో ఎదగాలి త్రిపుర రాష్ట్ర సి.ఎస్

అంతిమతీర్పు.24.8.2019


చర్మకారులు వృత్తి నైపుణ్యంతో ఎంటర్ పెన్యుర్స్ గా ఎదగాలి – త్రిపుర రాష్ట్ర సి.ఎస్.
లిడ్ క్యాప్ కావలసిన వసతులు కల్పనలో జిల్లా యంత్రాంగం ముందుంటుంది – జిల్లా కలెక్టర్ 
మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది, చర్మకాఋ వృత్తికి మంచిరోజులు రానున్నాయి – లిడ్ క్యాప్ ఏం.డి. 
తిరుపతి, ఆగస్టు 24 : ఎన్నో ఎల్లకింద అమెరికా అధ్యక్ష్యుడు అబ్రహం లింకన్ ప్రతిభను ఆదర్శంగా తీసుకుని చర్మకారి వృత్తిదారులు తమ నైపుణ్యం ప్రదర్శించి పారిమిక వేత్తలు అయ్యేందుకు కృషి చేయాలని త్రిపుర ప్రభుత్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరులు అన్నారు. చర్మకార వృత్తి  సంఘ నాయకుల ఆహ్వానం మేరకు త్రిపుర ప్రభుత్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరులు రేణిగుంట రోడ్డు నారాయణాద్రి ఆసుపత్రి వద్ద వెనుక గల చైతన్యపురం లిడ్ క్యాప్ శిక్షణా కేంద్రాని సందర్శించారు. త్రిపుర సి.ఎస్.మాట్లాడుతూ నేను ఈప్రాంతం వాసిని గుర్తుపెట్టుకుని ఆహ్వానిచ్చినందుకు ధన్యవాదలని అన్నారు. మీరు చేసే వస్తువులు నాణ్యత కలిగి వుంటే పరిశ్రమ వృధ్ధికి దోహదపడుతుందని అన్నారు. తాను చేసి పనిని ధైర్యంగా చెప్పుకోవడం , నాణ్యత పాటిస్తే తయారీ వస్తువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని మీరు కోరినమేరకు త్వరలో మీరు తయారు వస్తువులు, టిటిడి, నగరపాలక సంస్థ వాడేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు.
 లిడ్ క్యాప్ ఏం.డి.సాదు సుందరం మాట్లాడుతూ ఇక్కడ వున్న శిక్షణా సంస్థ లో వున్న యంత్రాలు 2003 లో ఇచ్చినవని వాడకం లేని కారణంగా పాడైనాయని తెలిపారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నదని చర్మకార వృత్తి దారులకు మంచి రోజులు రానున్నాయని అన్నారు. కేంద్రప్రభుత్వం లెదర్ క్లస్టర్ మన రాష్టానికి మంజూరు చేస్తే జి.డి.నెల్లూరు వద్ద మనకు వున్న 350 ఎకరాలు లిడ్ క్యాప్ పేరున లేనందున ఆగిందని, జిల్లా కలెక్టర్ త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రిక పూర్తిచేసి ఇవ్వాలని కోరారు. 
 జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తా మాట్లాడుతూ లిడ్ క్యాప్ కోరిన మేరకు త్వరలో భుని అప్పగిస్తామని అన్నారు. అలాగే ఏ విషమైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చని సూచించారు. త్వరలో పరిశ్రమ రూపుదిద్దుకునేందుకు జిల్లా యంత్రాంగ ముందుంటుదని మాటిచ్చారు. 
 తిరుపతి సివిల్ జడ్జి రామచంద్రుడు మాట్లాడుతూ త్రిపుర సి.ఎస్.స్ఫూర్తిగా మనం చదువులో , వృత్తి రాణించాలని అప్పుడే మనకు ఇక గుర్తింపు కలుగుతుందని అన్నారు.
 అనంతరం బైరాగి పట్టెడ వద్ద నిర్మిస్తున్న జగజీవన్ రామ్ భవన్ ఆగిందని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలి కోరగా వెళ్ళి నిర్మాణంలో వున్న భవనాన్ని పరిశీలించి పూర్తిచేయని కలెక్టర్ ను త్రిపుర సి.ఎస్.కోరారు. 
 ఈ సమావేశంలో ఆర్డీఓ కనకనర్సారెడ్డి, రూరల్ తహశీల్దార్ కిరణ్ కుమార్ ,నాయకులు కోటేశ్వరావు, అర్జున్ , సంతానం , వెంకటరత్నం, విశ్వనాధం, రత్నాకర్, సిఎస్ చిన్ననాటి స్నేహితులు  తదితరులు పాల్గొన్నారు. ----


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ