అందుకే తెదేపా రాద్ధాంతం చేస్తోంది: బొత్స


విజయనగరం : ఇసుకపై సంపాదన పోతుందనే ఆందోళనతోనే తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా చేపట్టిన నిరసన కార్యక్రమాలపై బొత్స స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా ప్రగతిపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న బొత్స మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా తెదేపా నేతలకు ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదని.. ఇప్పుడు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుండటంతో వారికి సంపాదన పోతుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా కొత్త విధానాన్ని రూపొందించి అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందన్న మంత్రి.. ఇసుకపై తీసుకొచ్చిన నూతన విధానం అమలకు కూడా సమయం పడుతుందని వివరించారు. కొన్నాళ్లు ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం ముందే చెప్పిందని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని.. తెదేపా మాత్రం అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ బొత్స ధ్వజమెత్తారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image