ఆక్వా అక్వేరియా - 2019 ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు

 హైదరాబాద్, ఆగస్టు 30, 2019


 


ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఈ రోజు సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్ధ (ఎంపిఇడిఎ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటైన ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను ఆయన ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే రెండో స్ధానంలో భారత్ ప్రస్తుతం ఉందని, మొదటి స్దానానికి చేరడానికి‌ కృషి జరగాలని ఈ సందర్భంగా అన్నారు.ఆక్వారంగంలో ఉత్పాదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచంలో ఆక్వా ఉత్పత్తుల‌లో మొదటి స్దానానికి చేరేందుకు కృషి జరగాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న జల వనరులను కేవలం 40 శాతమే ఆక్వా కల్చర్ కు వినియోగించుకుంటున్నామని చెబుతూ, ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపిఇడిఎ లాంటి సంస్ధలు, ప్రభుత్వ సంస్దలు, పరిశోధనా సంస్దలు కృషి చేయాలని సూచించారు. మెరుగైన ఫిషరీస్ మేనేజ్ మెంట్ పద్దతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలని, వాతావరణ మార్పుల ను దృష్టిలో ఉంచుకోవాలని కూడా పేర్కొన్నారు. క్షేత్ర స్ధాయిలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, వారికి లాభాలలో తగిన వాటా ఉండేలా విధానాల రూపకల్పన జరగాలని సూచించారు.దేశంలో ఆహార సమృద్ది ఉన్నప్పటికీ, ప్రోటీన్ సహిత పోషకాహారంలో సముద్ర ఉత్పత్తులను మించిన సరైన అహారం‌ మరొకటి లేదని అన్నారు. సాంప్రదాయ ఆహార పద్దతులే సరైనవని చెబుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించిన 'ఫిట్ ఇండియా' కార్యక్రమం ఉద్యమంగా మారాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. భౌతికంగా ఫిట్ గా ఉన్నపుడే మానసికంగా దృఢంగా ఉంటామని ఆయన‌ పేర్కొన్నారు. ఫిట్ నెస్, యోగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార అలవాట్లను పునః సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ, ప్రోటీన్లతో కూడిన పోషకాహారం పోషకాల లోపాన్ని నివారిస్తుందని పేర్కొన్నారు.


 


తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టడాన్ని ఉప రాష్ట్రపతి అభినందించారు. అక్వారంగంలో జరిగే పరిశోధనలు ఆ రంగం రైతులకు ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి ఉద్భోదించారు.


 


తెలంగాణా మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ అభివృద్ది పథకం కింద మత్స్యకారులకు 70-90 శాతం రాయితీతో పరికరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. 'ప్రధాన మంత్రి సురక్ష యోజన' కింద మాత్స్యకారులకు లబ్ది చేకూరుస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ళలో 128 కోట్ల సీడ్ పంపిణీ అయిందని, 4 కోట్ల పైగా రొయ్యల సీడ్ ను జలాశయాల్లో వదిలినట్లు, దీనివల్ల రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ది ఊపందుకొందని అన్నారు. ఎంపిఇడిఎ సాంకేతిక సహాకారం రాష్ట్రానికి అందించాలని కోరారు. తొమ్మిది ప్రాంతాలలొ ప్రయోగాత్మకంగా చేపట్టిన రొయ్యల పెంపకం విజయవంతం కావటంతో ఈ ఏడాది మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో రాష్ట్రం‌ నుంచి ఆక్వా ఎగుమతుల వృద్దికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు.


 


అంతకు ముందు, ఆంద్ర ప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ. సువిశాల సముద్రతీరం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుంచే ఆక్వారంగంలో 60 శాతం విదేశీ మారకం వస్తోందని అన్నారు. 14.5 లక్షల మంది రాష్ట్రంలో ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, అందుకు తగిన రీతిలో ఈ రంగం అభివృద్దికి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం ఈ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఆకారణంగా డీజిల్ రాయితీ ని పెంచడం, నాణ్యమైన సీడ్ ను ఇచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అక్వా రైతుల పట్టుదలే రాష్ట్రంలో అభివృద్దికి కారణమని అన్నారు. హ్యాచరీస్ కు సంబంధించి నాణ్యమైన సీడ్ అందించేందుకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఎంపిఇడిఎ సహకరించాలని కోరారు. వైరస్ వ్యాప్తి నివారణకు పాలిమర్ కిట్స్ పంపిణీ లో ప్రైవేట్ సంస్ధలను కూడా అనుమతించాలని సూచించారు. మెరైన్ రంగంలో మార్పులు చేసి ఆదునిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తేవాలని ఎంపిఇడిఎ కు సూచించారు.


 


ఎంపిఇడిఎ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆక్వారంగ అభివృద్దికోసం ప్రభుత్వం, ప్రైవేటురంగం అమలు చేస్తున్న చర్యలను వివరించారు.


 


ఈ సందర్భంగా ఆక్వా రంగంలో విశేష కృషి చెసిన పది మంది ఆక్వా రైతులకు ఉప రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు.


 


రాజ్య సభ సభ్యులు బండ ప్రకాశ్, చేవెళ్ళ లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image