తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పై సి.ఎం.సమీక్ష

👆31–08–2019
అమరావతి


అమరావతి: కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వ్యర్థాలవల్ల భూగర్బజలాలు కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర తనిఖీ, అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
ప్రభుత్వ నిపుణుల కమిటీని నియమించిన ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు 
యురేనియం కార్పొరేషన్‌ వ్యర్థాలు నిల్వచేస్తున్న పాండ్, దాని చుట్టుపక్కల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయా? లేదా? అన్న విషయంౖపై అధ్యయనం చేయనున్న నిపుణుల కమిటీ
నిపుణుల కమిటీలో సభ్యులుగా ఎన్‌జీఆర్‌ఐ, జియాలజీ, ఏపీ ప్రభుత్వ భూగర్భ జల విభాగం, అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు,  ఏపీ మైన్స్‌ మరియు జియాలజీ విభాగం, రాష్ట్ర వ్యవసాయశాఖ, తిరుపతి ఐఐటీ నుంచి నిపుణులను నియమించనున్న పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు. 
మూడురోజుల్లోగా నియామకాలు పూర్తిచేయనున్న  పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు
10 రోజుల్లోగా నివేదిక అందించనున్న కమిటీ. 
 
ప్రమాణాలను పాటించడంలేదని, టెయిల్‌ పాండ్‌ నిర్మాణంలో సరైన డిజైన్, ప్రణాళిక లేదంటూ జూన్‌ 21,2018న∙కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, రిటైర్డ్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ కె.బాబురావు పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డుకు ఫిర్యాదు
తర్వాత యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కొన్ని మార్గదర్శకాలు జారీచేసిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు
వీటిని కూడా పట్టించుకోకపోవడంతో ఆగస్టు 7న షోకాజ్‌ నోటీసు జారీచేసిన పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు.
తాము ఇదివరకు తీసుకున్న చర్యలు సకిపోతాయన్న యురేనియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.
తాజాగా నిపుణుల కమిటీ నియామకం.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image