4 న సత్తుపల్లిలో టి.యు.డబ్ల్యు.జె. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రాంతీయ సదస్సు

*4 న సత్తుపల్లి లో  TUWJ ( IJU ) ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రాంతీయ సదస్సు* 
_____________________________


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జర్నలిస్టులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆశించం అయితే తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను నిరాశకు గురిచేయటమే కాకుండా పూర్తిగా ఉపేక్షిస్తూ వస్తుంది.  సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. దురదృష్టకరం ఏమిటంటే గతంలోనే బాగుండేది అనే పరిస్థితి కల్పిస్తుంది. జర్నలిస్టుల సొంత ఇంటి కల నిజం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చినా ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడకపోవడం విచారకరం. గతంలో ఉన్న ఆరోగ్య బీమా పథకాన్ని తీసివేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులందరికి ఙెహెచ్ఎస్ పధకం కింద ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. అక్రిడిటేషన్ ల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 239 జీవో  వలన అనేక మందికి అన్యాయం జరుగుతుంది.  ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. వృత్తి పరమైన ఒత్తిడిలో అనేకమంది అకాల మరణం పొందుతున్నారు. 
మరోపక్క మీడియా రంగం అనేక ఒత్తిడిలకు గురై విలవిల్లాడుతొన్న పరిస్థితి అందోళన కలిగిస్తుంది. దేశ వ్యాప్తంగానే రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగమవటం,  భిన్నమైన ఆలోచనలు సహించలేకపోవటం, మూక దాడులకు పాల్పడటం,  మీడియా రంగంలోకి కార్పోరేట్ శక్తులు చొచ్చుకురావటం నేడు మనం చూస్తున్నాం. ఆ సంస్కృతే మన గడ్డపై కూడ ప్రభావం చూపుతుంది.  ఒక్కో కొమ్మను కొట్టి తమ ఆధీనంలో  నాటుకోవటం వల్ల ఆ కొమ్మలు ఎండి పోతున్నాయి. మాట్లాడే వారు మౌనం వహిస్తున్నారు. 
ఈ నేపథ్యంలో వృత్తి సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తునే ప్రజాస్వామ్య విలువల విధ్వంసాన్ని నిలువరించే ప్రయత్నానికి మనం నడుం బిగించాలి
ప్రస్తుత పరిస్థితి పై చర్చించుకొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవటం కోసం TUWJ IJU రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 4 న సత్తుపల్లి లో ( M R GARDENS,  సిద్దారం రోడ్  ) ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతుంది కావున  జర్నలిస్టులు అధిక సంఖ్యలో  పాల్గొని సదస్సు ను  విజయవంతం చేయగలరు.


*సదస్సు లో పాల్గొనే ముఖ్య నేతలు* 


కె. శ్రీనివాసరెడ్డి గారు 
TUWJ సలహాదారు


వై. నరేందర్ రెడ్డి గారు 
IJU జాతీయ కార్యదర్శి 


నగునూరి శేఖర్ గారు 
TUWJ రాష్ట్ర అధ్యక్షులు 


కె. విరహాత్ అలీ గారు 
TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 


అమర్ నాధ్ గారు 
మాజీ ప్రెస్ కౌన్సిల్ సభ్యులు 


కె. సత్యనారాయణ గారు 
IJU జాతీయ కార్యవర్గ సభ్యులు 


కె. రామనారాయణ గారు 
TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు *TUWJ  IJU ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల తరఫున* 
-- నర్వనేని వెంకట్రావు, ఖమ్మం  జిల్లా అధ్యక్షులు 
-- B V రమణారెడ్డి ,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు