తితిదే ట్రెజరీలో 5కిలోల వెండికిరీటం మాయం


తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కలకలం చోటు చేసుకుంది. తితిదే ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తితిదే ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతడి జీతం నుంచి రికవరీ చేసుకున్నారు. అసలు ఈ ఘటనకు కారకులెవరన్న విషయంపై తితిదే దృష్టి సారించకుండా.. కేవలం ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆయనొక్కరినే ఎందుకు బాధ్యుల్ని చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.