రెవెన్యూ పై ముఖ్యమంత్రి సమీక్ష

👆28–08–2019
అమరావతి


అమరావతి: రెవెన్యూపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్షా సమావేశం
వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖలపై సీఎం సమీక్ష
ప్రస్తుత పరిస్థితులను విభాగాల వారీగా నివేదించిన అధికారులు
వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గిందన్న అధికారులు
గడచిన నాలుగు నెలల్లో  ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధిలేదు: అధికారులు
స్టీల్, ఐరన్‌ రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోంది: అధికారులు
సిమ్మెంటు రేటు కూడా తగ్గడం వల్ల దానిమీద వచ్చే పన్నులు తగ్గుతున్నాయి: అధికారులు
వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గింది: అధికారులు
కాని ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయన్న ఆశాభావంతో ఉన్నాం: అధికారులు
జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల మొదటివారంలో రూ.597కోట్లు వస్తుంది: అధికారులు
వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ది ఉంటుంది:
లిక్కర్‌ వినియోగం గణనీయంగా తగ్గింది:
2018–2019లో 125 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయం: అధికారులు
బెల్టుషాపుల ఏరివేత వల్ల 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగం తగ్గింది: అధికారులు
ప్రైవేటు దుకాణాలు తొలగింపునకు రంగం సిద్ధం: అధికారులు
4380 నుంచి 3500కు దుకాణాలు తగ్గిస్తున్నాం: అధికారులు 
మొత్తం 20శాతం దుకాణాలు తగ్గించబోతున్నాం: అధికారులు
మద్యనియంత్రణ, నిషేధానికి, మరియు డీఎడిక్షన్‌ సెంటర్లకు రూ.500 కోట్లు పెంచుతున్నాం: అధికారులు
సెప్టెంబరు 1 నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద 503 దుకాణాలు: అధికారులు
16వేల ఉద్యోగాలు రాబోతున్నాయి:అధికారులు


సీఎం ఆదేశాలు:


మద్య నియంత్రణ,  నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలి: సీఎం
స్మగ్లింగ్‌ జరక్కుండా, నాటు సారా తయారీ కాకుండా చూడాలి: సీఎం
మద్యం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్యప్రణాళికలో ఉంచాలని సీఎం ఆదేశం
గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ
మద్య నిషేధం అమలుకోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుల వినియోగం
రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదు: సీఎం
అధ్యయనం చేసి ఒక విధానాన్ని తీసుకురావాలని ఆదేశం:సీఎం
ఒకమార్గ దర్శక ప్రణాళికను తీసుకురావాలని అధికారులకు ఆదేశం:సీఎం


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image