నెల్లూరు  ఐక్యవేదిక పట్టణ మహిళ అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మి.

 


ఎస్సీ ఎస్ టి బీసీ మైనార్టీల ఐక్యవేదిక నెల్లూరు పట్టణ  అధ్యక్షురాలిగా తోట రాజ్యలక్ష్మి ఎన్నుకున్నట్లు గా ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు పో ను గు పా టీ పూర్ణచందర్రావు తెలిపారు. స్థానిక ఐక్యవేదిక కార్యాలయంలో  సోమవారం రాజ్యలక్ష్మికి నియామక పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ నెల్లూరు పట్టణానికి మహిళ అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మిని నియమించామని, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఐక్యవేదిక అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. బలహీన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. బడుగు బలహీన వర్గాలు రాష్ట్రంలో వెనుకబడి ఉన్నారని, సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు అండగా ఉంటానని, వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అనగారిన వర్గాల ప్రజలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, వారికి ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో 50% ప్రతి దానిలో కేటాయించాలని కోరారు. మహిళలకు ఆసరాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక లీగల్ సెల్ న్యాయవాది కిరణ్ కుమార్, జి. గాబ్రియల్, ప్రశాంత్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.