దక్షిణ భారతదేశంలో పవిత్ర శ్రీశైలం పుస్తకాన్ని ఆవిష్కరించిన అజయ్ కల్లాం


అమరావతి : దక్షిణ భారతదేశంలో పవిత్ర శ్రీశైలం అనే పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం ఆవిష్కరించారు. శ్రీశైలం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణం చరిత్ర సంస్కృతి, పురావస్తు శాస్త్రం పీఠాధిపతి మరియు పురావస్తుశాఖ మాజీ సంచాలకులే ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి గ్రంధస్తం చేసిన ఈ పుస్తకాన్ని శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో అజయ్ కల్లాం చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ గ్రంథం చరిత్ర పూర్వం నాటి శ్రీశైల పుణ్యక్షేత్రం చరిత్ర సంస్కృతి మరియు శ్రీశైలక్షేత్ర ముఖద్వారాలు గురించి వీరశైవమత విశిష్టతను తెలియజేస్తోంది. అదే విధంగా పంచమఠాలు గురించి, అక్కమహాదేవి చరిత్రను, పండుగలు, జాతరలు, మధ్యయుగం నాటి వీరశైవమత వ్యాప్తి, ఆనాటి నాణేల ద్వారా శైవమత వ్యాప్తిని తెలియజేస్తోంది. అదేవిధంగా నల్లమడ అడవుల్లో పర్యావరణం విశిష్టతను, విజయనగర రాజులు, కాకతీయు రాజులు శ్రీశైల క్షేత్రం నిర్మాణంలో వారి పాత్రను తెలియజేస్తోంది. వీరశైవ మతం ప్రాముఖ్యతను గురించి ఈ పుస్తకంలో వివరంగా తెలియజేయడం జరిగింది.
  ఈ సందర్భంగా పుస్తకరచయిత చెన్నారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రాప్తాడు ఎంఎల్ఏ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, వైసిపి ఐటి కార్యదర్శి కె.వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని చెన్నారెడ్డిని అభినందించారు.