అక్టోబ‌ర్ నుంచి 20శాతం :  సీఎం జగన్


అమరావతి: బెల్టుషాపుల‌పై ఉక్కుపాదం ఫ‌లితంగా మ‌ద్యం వినియోగం త‌గ్గుతోందని సీఎం జగన్‌ చెప్పారు. అక్టోబ‌ర్ నుంచి 20శాతం మద్యం దుకాణాలు బార్ల సంఖ్యను తగ్గిస్తామని తెలిపారు. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం ఉంటుందని పేర్కొన్నారు. దశలవారీ మద్యం నిషేధం దిశగా అడుగులు వేయనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా జగన్ తెలిపారు.